
ట్యాగ్ · 3 కథనాలు


టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం

నన్ను కంగారు పెట్టేది అదే
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.

తారక్ మాడ్యులేషన్ అంటే ఎంతో ఇష్టం - కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ రాజా వారు రాణి గారు (2019)మూవీ తో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన ఎస్.ఆర్. కల్యాణ మండపం మూవీ ఘనవిజయం సాధించి కిరణ్ ను కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. సూపర్ హిట్ సమ్మతమే తో కిరణ్ ప్రేక్షకులను అలరించారు. పలు మూవీ ఆఫర్స్ తో కిరణ్ బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది.

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం
చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా స్టార్ చిరంజీవి , విజయ్ దేవరకొండ , నిఖిల్ , విశ్వక్ సేన్ వంటి వారు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనే యువనటుడు ఆకోవకు చెందుతారు. "రాజాగారు రాణివారు " వంటి చిన్న సినిమాతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన కిరణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు.