ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2
తండ్రీ కొడుకులుగా రవితేజ ?
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా సూపర్ హిట్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ " ఖిలాడి "మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'ఖిలాడి' లో మలయాళ హీరో
రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న విడుదల చేసిన వీడియో గ్లిమ్స్‌కు సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది. రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
అభిమానులకు రవితేజ బర్త్ డే గిఫ్ట్
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో, సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన మూవీస్ లో “క్రాక్ ” మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.