
ట్యాగ్ · 3 కథనాలు


"రాజా విక్రమార్క " గా కార్తికేయ

షూటింగ్ పూర్తి చేసుకున్న 'రాజా విక్రమార్క'
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత ఇప్పటివరకూ వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా అప్పుడప్పుడు విలన్ గా కూడా పలకరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు.

'రాజా విక్రమార్క' న్యూ పోస్టర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోకార్తికేయ ఆసినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత హిప్పీ, గుణ 369, 90 ML, చావు కబురు చల్లగా లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ఇప్పుడు 'రాజావిక్రమార్క' సినిమా చేస్తున్నాడు. కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా బక్రీద్ కానుకగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. బక్రీద్ పోస్టర్ కాబట్టి విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ముస్లిం గెటప్ లో డిఫరెంట్ లుక్‌లో ఉన్నాడు కార్తికేయ.

"రాజా విక్రమార్క " గా కార్తికేయ
“ప్రేమ తో మీ కార్తీక్ “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కార్తికేయ సూపర్ హిట్ “RX 100 “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గుర్తింపు పొంది ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. “హిప్పీ “, “గుణ 369 “, “90 ML “మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ “మూవీ లో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.హీరో కార్తికేయ మాట్లాడుతూ .. విలన్ పాత్రలంటే ఇష్టమనీ , ప్రతినాయక పాత్రలలో టాలెంట్ బయటపడుతుందనీ , విలన్ పాత్రలపై తన కున్న ఆసక్తిని కార్తికేయ తెలిపారు.