
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2


సర్దార్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా రాశీ ఖన్నా

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"

కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది

కార్తీ సర్దార్ ట్రైలర్ అప్ డేట్
కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విభిన్నమైన సినిమాలు చేయడంలో తమిళ్ హీరో కార్తీ కూడా ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా కార్తీకి మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్ గా విరమన్ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. అభిమన్యుడు మూవీ ఫేమ్ పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా సర్దార్. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సర్దార్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా రాశీ ఖన్నా
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటిస్తున్న ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై అమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన "పరుత్తి వీరన్"(2007 )మూవీ తో స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ కథానాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రియమణి కథానాయిక. బెస్ట్ ఫిల్మ్ , ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన అమీర్ బెస్ట్ డైరెక్టర్ , అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తీ బెస్ట్ యాక్టర్ , ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ కార్తీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

కార్తీ కి హీరోయిన్ గా డైరెక్టర్ శంకర్ కూతురు
తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈసినిమా టైటిల్ ను తాజాగా ప్రకటించగా... విరుమన్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. దీనితో పాటు ఈసినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు సూర్య. ఆసక్తికరమైన విషయం ఏంటంటేఇక ఈసినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరంటే డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితీ శంకర్. అదితీ శంకర్ హీరోయిన్ గా ఈసినిమాతో అరంగేట్రం చేయనుంది.

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.