
ట్యాగ్ · 63 కథనాలు · పేజీ 4


కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం

మంచు విష్ణు కన్నప్ప నుంచి తప్పుకున్న హీరోయిన్
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు సరసన 'ఆదిపురుష్' ఫేమ్ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ని కథానాయికగా ఎంపిక చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. ఇంతలో ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగుచూసింది. అదేంటంటే.. ‘కన్నప్ప’ నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా విష్ణునే తెలియజేశారు.

కన్నప్పలో ప్రభాస్.. హింట్ ఇచ్చిన మంచు విష్ణు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని హీరో మంచు విష్ణు ఇదివరకే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వెల్లడయింది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రారంభం
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు కలల చిత్రం (డ్రీమ్ ప్రాజెక్ట్) ‘భక్త కన్నప్ప’. ‘కన్నప్ప’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఈరోజు శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభించారు. 'అవా ఎంటర్టైన్మెంట్' మరియు '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' పతాకంపై విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ విష్ణు సరసన కథానాయికగా నటించనుంది. దివంగత సీనియర్ నటుడు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం ఈ ‘భక్త కన్నప్ప’. అయితే…