కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kajal Agarwal Is Paired With Hero Suriya

ట్యాగ్ · 3 కథనాలు

సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ ఫిలాసఫీ

తెలుగు ,తమిళ స్టార్ హీరోలతో జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా కాజల్ నటిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు "(తెలుగు ), "ఇండియన్ 2 ", "హే సనమిక "(తమిళ ) "ముంబై సాగా " (హిందీ ) మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీస్ తో పాటు కాజల్ , స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న "తుపాకి 2", హరి దర్శకత్వంలో స్టార్ హీరోసూర్య కథానాయకుడిగా రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బిజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్

స్టార్ హీరోలతో జంటగా తెలుగు తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. స్టార్ హీరోల చిత్రాలతో పాటు యువ హీరోల చిత్రాలలో కూడా నటించి కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు . కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", తెలుగు ,ఇంగ్లీష్ భాషలలో తెరకెక్కుతున్న "మోసగాళ్ళు "(తెలుగు ), "ఇండియన్ 2", "తుపాకి సీక్వెల్ "(తమిళ ), "ముంబై సాగా " హిందీ మూవీస్లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో సూర్య కు జోడీగా కాజల్ అగర్వాల్ ?

"గురు " మూవీ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడు గా రూపొందిన "సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా )తమిళ మూవీ అక్టోబర్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో సూర్య తన నెక్స్ట్ పిక్చర్ కు సన్నద్ధం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ "మాత్త్రాన్ "(బ్రదర్స్ ) మూవీ లో సూర్య , కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. సూర్య ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ లో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకొంటున్నారు .

Team TFNవాట్సాప్

షేర్