బిజీ హీరోయిన్ కాజల్ అగర్వాల్

Actress Kajal Aggarwal Gets Busy With Back To Back Movies

స్టార్ హీరోలతో జంటగా తెలుగు తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కాజల్ అగర్వాల్ బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. స్టార్ హీరోల చిత్రాలతో పాటు యువ హీరోల చిత్రాలలో కూడా నటించి కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు . కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, తెలుగు ,ఇంగ్లీష్ భాషలలో తెరకెక్కుతున్న “మోసగాళ్ళు “(తెలుగు ),
“ఇండియన్ 2”, “తుపాకి సీక్వెల్ “(తమిళ ), “ముంబై సాగా ” హిందీ మూవీస్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కాజల్ కు మరో భారీ తమిళ మూవీ లో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా “ఆరు “, “వేల్ “, “సింగం”సిరీస్ లో మూడు చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు హరి , సూర్య హీరోగా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ రూపొందించనున్నారు. సూర్య యాక్షన్ హీరో గా పలు మూవీస్ రూపొందించిన దర్శకుడు హరి ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ తో సూర్య ను ప్రెజెంట్ చేయడం విశేషం. ఈ మూవీ లో సూర్య కు జోడీగా కాజల్ అగర్వాల్ ఎంపిక అయినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =