
ట్యాగ్ · 4 కథనాలు


కబ్జా టీజర్ కు సూపర్ రెస్పాన్స్

నితిన్ స్వంత బ్యానర్స్ పై పాన్ ఇండియా మూవీ కబ్జ రిలీజ్
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలలో బిజీగా ఉండగా ఈ చిత్రాలతో పాటుగా తాను తెలుగు రాష్ట్రాలలో పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం విక్రమ్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయగా ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు నితిన్ మరో భారీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

కబ్జా టీజర్ కు సూపర్ రెస్పాన్స్
కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ఉంటాడు ఉపేంద్ర. తను చేసే సినిమాలు రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టే తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఉపేంద్ర నుండి వస్తున్న సినిమా కబ్జా. ఆర్ చంద్రు దర్శకత్వంలో 1970బ్యాక్‌డ్రాప్‌లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

ఉపేంద్ర "కబ్జా" మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "కబ్జా"కన్నడ మూవీ తెరకెక్కుతుంది. హీరో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న ఈ మూవీ లో మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "ముకుంద మురారి "మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఉపేంద్ర , సుదీప్ మరో సారి "కబ్జా" మూవీ తో కన్నడ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , సముద్ర ఖని, డానిష్ అక్తర్ సైఫీ, కబీర్ దుహాన్ సింగ్ , ప్రదీప్ రావత్ నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

"కబ్జా " మూవీ నుండి ఉపేంద్ర , సుదీప్ లుక్ రిలీజ్
ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇప్పుడు ఒక గ్యాంగ్ స్టర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర కథానాయకుడిగా భారీ బడ్జెట్ తో "కబ్జా "కన్నడ మూవీ తెరకెక్కుతుంది. హీరో ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా నటిస్తున్న ఈ మూవీ లో మరో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.