
ట్యాగ్ · 3 కథనాలు

తలైవి మూవీ షూటింగ్ నవంబర్ 6వ తేదీ ప్రారంభం ?

మరోసారి కరుణానిధిగా ప్రకాష్ రాజ్?

"తలైవి " స్పెషల్ పోస్టర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా “తలైవి” మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న “తలైవి” మూవీకి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
తలైవి మూవీ షూటింగ్ నవంబర్ 6వ తేదీ ప్రారంభం ?
విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ నిర్మాణ సారథ్యంలో AL విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తలైవి మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ మూవీ కై కంగనా రనౌత్ తమిళ భాషను నేర్చుకొనడం విశేషం. తలైవి షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో జయలలిత యంగ్ ఏజ్ లో ఉన్న సన్నివేశాలని తెరకెక్కిస్తారని , తరువాత షెడ్యూల్ నుండి బరువు పెరిగిన కంగన తో చిత్రీకరణ జరుపుతారని సమాచారం.

మరోసారి కరుణానిధిగా ప్రకాష్ రాజ్?
పలు విజయవంతమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి... ఆ పాత్రలకే వన్నె తెచ్చిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో మరో ఇంట్రెస్టింగ్ రోల్ చేయనున్నట్లు సమాచారం. అది కూడా 22 ఏళ్ళ క్రితం తను పోషించిన పాత్ర తరహాలోదే కావడం విశేషం.