
ట్యాగ్ · 5 కథనాలు


కొంతకాలం బ్రేక్ అంటున్న 'రానా'

ఎత్నిక్ వేర్ లో స్టైలిష్ కపుల్ రానా , మిహీకా
ప్రభాస్ తో మరోసారి-రానా రియాక్షన్

రానా-వెంకీ వెబ్ సిరీస్ రానా నాయుడు టీజర్ రిలీజ్
ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. ఒకప్పటిలా కాకుండా స్టార్ హీరోలు సైతం ఇతర స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఏమాత్రం సందేహించడం లేదు. ఇక ఇప్పటికే పలు సినిమాలు సందడి చేసేశాయి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేస్తున్నారు. వారు ఎవరో కాదు దగ్గుబాటి ఫ్యామిలీ నుండి విక్టరీ వెంకటేష్ ఇంకా రానా. వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టాలీవుడ్ అగ్రహీరో గా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు రానా.. టాలెంటెడ్ హీరో. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. ఈ వెబ్ సిరీస్ పై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కొంతకాలం బ్రేక్ అంటున్న 'రానా'
2010లో ‘లీడర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు రానా. ఇక అప్పటినుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. అందుకే రానా సినిమా అంటే అందరికీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇటీవలే విరాట పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడుతూ ఫైనల్ గా ఇటీవలే రిలీజ్ అయింది. ఇక కలెక్షన్స్ పరంగా సినిమా నిరాశ పరిచినా పెర్ఫామెన్స్ పరంగా మాత్రం విమర్శకుల ప్రశంసలు కురిపించారు.

"విరాటపర్వం" మూవీ కై ఫ్యాన్స్‌కు సాయిపల్లవి స్పెషల్ రిక్వెస్ట్
సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90ల కాలం నాటి కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన “విరాటపర్వం” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రియమణి , నందితా దాస్, నివేత పేతురాజ్ , సాయిచంద్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.ఈమూవీ లో రానా , సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఎత్నిక్ వేర్ లో స్టైలిష్ కపుల్ రానా , మిహీకా
సక్సెస్ ఫుల్ "లీడర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ లో భల్లాలదేవ గా నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రానా బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ "భీమ్లా నాయక్ "మూవీ లో పవన్ కళ్యాణ్ తో పోటీపడి నటించిన రానా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రానా హీరోగా తెరకెక్కిన "విరాటపర్వం"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రభాస్ తో మరోసారి-రానా రియాక్షన్
బాహుబలి సినిమా అంటే మొదట మనకు గుర్తొచ్చేది బాహుబలి ప్రభాస్-భళ్లాలదేవ రానా. వారిద్దరూ లేకపోతే ఆ సిరీస్ లేనట్టే అని చెప్పొచు. ఇక ఈ సినిమాతో అటు ప్రభాస్, రానా కెరీర్ రేంజ్ ఏ కాదు.. తెలుగు సినిమా రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇక ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేస్తున్న 21 సినిమాలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అందులో ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదనుకోండి..