ట్యాగ్ · 103 కథనాలు · పేజీ 6
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సీడీపీ రిలీజ్
వదర బాధితుల కోసం 1 కోటి 50 లక్షలు విరాళం
ఒకపక్క కరోనా వల్ల ఇప్పటికే ప్రజలు పలు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క భారీ వర్షాలు ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని ఎన్నో ప్రాంతాలు నీట మునిగి లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక కేసీఆర్ పిలుపు మేరకు తెలుగు ఇండస్ట్రీ అంతా కదలివచ్చింది. మన తెలుగు హీరోలు అందరూ ముందుకొచ్చి తమకు తోచినంత సాయం చేశారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో మన బాహుబలి కూడా చేరిపోయాడు.
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సీడీపీ రిలీజ్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2"మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తో బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజీ హీరోగా మారారు. హీరో ప్రభాస్ మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రూపొందడం విశేషం. "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న ప్రభాస్ ఆ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సైన్స్ ఫిక్షన్ మూవీ , ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న మైథలాజికల్ "ఆదిపురుష్ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'రాధేశ్యామ్' కు మ్యూజిక్ డైరెక్టర్ గా 'జస్టిన్ ప్రభాకరన్'
బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న "రెబల్‌స్టార్" ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ తో బిజీ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇటీవలే పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా "బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్" పేరిట మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.