
ట్యాగ్ · 3 కథనాలు


రాబిన్ హుడ్ నుండి నితిన్ న్యూ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. నితిన్ కు కూడా హిట్ దక్కి చాలా రోజులైపోయింది. అందుకే ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. భీష్మ తరువాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న సినిమా రాబిన్ హుడ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.

నితిన్ బర్త్ డే.. తమ్ముడు ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ అయిన నితిన్.. తన కొత్త చిత్రానికి ఆయన సినిమా టైటిల్ నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో 'కాంతార ఫేం' సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది.

నితిన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్
సూపర్ హిట్ "జయం " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నితిన్ పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరో నితిన్ కథానాయకుడిగా రూపొందిన "రంగ్ దే!" మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ "తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్నారు. "పవర్ పేట " మూవీ కి హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.