
ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3


'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్

18 పేజీస్.. నిఖిల్ సోలో పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ నేడు పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసందర్భంగా తన సినిమాల నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ 2 నుండి స్పెషల్ పోస్టర్ ను.. అలాగే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న 18 పేజీస్ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా 18 పేజీస్ నుండి నిఖిల్ కు సంబంధించి సోలో పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్
యువ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజీస్. టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.. డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సుకుమార్ విలక్షణమైన పాత్రను సృష్టించాడట. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి రీసెంట్ గానే ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ లుక్ కూడా అందర్నీ ఆకట్టుకుంది.

'18 పేజీస్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా గత ఏడాదే మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేక పోయింది. దానికి కారణం ఏంటో కూడా తెలుసు. అయితే ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఈలోపు ఇతర పనులను కానిచ్చేస్తున్నారు.