
ట్యాగ్ · 3 కథనాలు


రోహిత్ శెట్టి చేతిలోకి గీత గోవిందం రీమేక్ రైట్స్

బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ సీక్వెల్ అప్ డేట్
అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ గీతగోవిందం మూవీ 2018 ఆగష్ట్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించిన విజయ్ దేవరకొండ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నారు. విజయ్, రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీతో హీరో విజయ్, రష్మిక స్టార్…

రోహిత్ శెట్టి చేతిలోకి గీత గోవిందం రీమేక్ రైట్స్
పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అల్లు అరవింద్ మరియు బన్నీ వాసు నిర్మాతలుగా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇంత హిట్ అయిన సినిమానురీమేక్ చేయకుండా ఎలా ఉంటారు. ఇప్పటికే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ హిట్ ‘గీత గోవిందం’కి ఏడాది
“ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాల్లే ఇది చాల్లే”... అనిపించే స్థాయి ఘనవిజయం సొంతం చేసుకున్న చిత్రం `గీత గోవిందం`. మీడియం బడ్జెట్ మూవీస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్... యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచింది. గీతగా రష్మిక మందన్న... గోవిందంగా విజయ్ నటించిన ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక దర్శకుడు పరశురామ్ సంభాషణలు, దర్శకత్వ ప్రతిభ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి.