
ట్యాగ్ · 3 కథనాలు


శృతిహాసన్ డ్యాన్స్ రిహార్సల్

పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “గబ్బర్ సింగ్ ” మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు.

శృతిహాసన్ డ్యాన్స్ రిహార్సల్
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 3 సంవత్సరాల గ్యాప్ తరువాత శృతి హాసన్ కథానాయిక గా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్ “మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కి 8 ఏళ్ళు
“నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది”.. అంటూ 8 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్ థియేటర్లలో ఏ స్థాయిలో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా అదే బాట పట్టింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో పవన్‌కు జోడిగా శ్రుతి హాసన్ నటించింది…