ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2
'గామి' టీమ్ కు బన్నీ స్పెషల్ విషెస్..!
ఈమధ్య పెద్ద హీరోలు చిన్న హీరోలకు అలానే చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమాలపై సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు. ఇక అందులో అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు చిత్రయూనిట్ ను పిలిచి మరి అభినందిస్తుంటాడు బన్నీ. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ మరో యంగ్ హీరోకు అలాగే తన సినిమాపై స్పందించి స్పెషల్ గా విషెస్ అందించారు. ఆ హీరో.. ఆ సినిమా ఏదో కాదు.. విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గామి సినిమా.

'గామి' గా వస్తున్న విశ్వక్ సేన్
ఈ ఏడాది పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఎక్కడా తగ్గట్లేదు. అంతేకాదు డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాతో పాటు విశ్వక్ ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్
"వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” “ఫలక్ నుమా దాస్”, మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్”మూవీ కి విశ్వక్ సేన్ స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం వహించడం విశేషం. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న విశ్వక్ సేన్ రీసెంట్ గా "పాగల్ "మూవీలో చాలా ఫ్రెష్ లుక్ లో మంచి ఎనర్జిటిక్ గా సినిమా అంతా నడిపిస్తూ కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్ ని కూడా చాలా ఈజీ గా చేసి ప్రేక్షకులను అలరించారు.