
ట్యాగ్ · 3 కథనాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సీతారామం'
హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ సీతారామం. 1965 కాలానికి ప్రజెంట్ టైమ్‌ను కలుపుతూ డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఈసినిమా వస్తుంది. మహానటి, కనులు కనులను దోచాయంటే సినిమాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఇక ఈసినిమా ఆగష్ట్ 5వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోష్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

సీతారామం కోసం ఎవరు..?
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది. హను రాఘవపూడి మరోో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో వస్తున్నాడని అర్థమవుతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించునున్నారు. ఈనేపథ్యంలో దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ లేదా ప్రభాస్ కానీ అతిథులుగా రానున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దుల్కర్ సల్మాన్ న్యూ స్కిల్స్
కమర్షియల్ సక్సెస్ "సెకండ్ షో "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ సల్మాన్ పలు సూపర్ హిట్ తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దుల్కర్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దుల్కర్ ప్రస్తుతం "సీతారామమ్"(తెలుగు ), "చుప్ "(హిందీ ), రెండు మలయాళ మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.