
ట్యాగ్ · 3 కథనాలు

పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
'దృశ్యం 2' మొదలుపెట్టిన మోహన్‌లాల్

స్పీడుమీదున్న వెంకీ - దృశ్యం2 ప్యాకప్
వెంకీ స్పీడు మాములుగా లేదు. దృశ్యం 2 సినిమా అలా మొదలు పెట్టాడో లేదో అప్పుడే షూటింగ్ ను పూర్తి చేసేశాడు. జీతూ జోసఫ్ దర్శకత్వంలో వెంకీ ప్రధాన పాత్రలో దృశ్యం రీమేక్ దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజులుగా ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ ఏడాదే ఈసినిమాను రిలీజ్ చేయాలన్న నేపథ్యంలో అస్సలు గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ ను చేశారు. 50 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని రంగంలోకి దిగింది చిత్రబృందం.. అనుకున్నట్లుగానే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసేలా కనిపిస్తుంది. ఇప్పటికే వెంకీ తన పార్ట్ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని జీతూ జోసఫ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు…
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రేక్షకులను అలరించి మీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు. పలు భాషల మూవీస్ కు మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మీనా , రజనీకాంత్ "అన్నాత్తే "(తమిళ ), మోహన్ లాల్ "దృశ్యం 2 " మూవీస్ లో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలోమోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మలయాళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. "దృశ్యం "మూవీ పలు భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
'దృశ్యం 2' మొదలుపెట్టిన మోహన్‌లాల్
మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూజోసఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.