
ట్యాగ్ · 3 కథనాలు

"దృశ్యం 2" మలయాళ మూవీ షూటింగ్ ప్రారంభం
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా

ప్రముఖ నిర్మాణ సంస్థకు ‘దృశ్యం2’ హిందీ రైట్స్
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈసినిమా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో రీమేక్ చేయగా అన్ని భాషల్లోమంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” కూడా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు తెలుగులో కూడా దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ-మీనా ప్రధాన పాత్రల్లోనే ఈరీమేక్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
"దృశ్యం 2" మలయాళ మూవీ షూటింగ్ ప్రారంభం
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో స్టార్ హీరో మోహన్ లాల్ , మీనా జంటగా వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "దృశ్యం "మలయాళ మూవీ ఘనవిజయం సాధించి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఫస్ట్ మలయాళ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసి, 150 రోజులకు పైగా ప్రదర్శించబడింది.అనూహ్య పరిస్థితులలో చిక్కుల్లో పడ్డ కుటుంబ సభ్యులను రక్షించుకొనడానికి తపన పడే వ్యక్తి గా మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
పీపీఈ కిట్ లో హీరోయిన్ మీనా
దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ప్రేక్షకులను అలరించి మీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణించారు. పలు భాషల మూవీస్ కు మీనా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న మీనా , రజనీకాంత్ "అన్నాత్తే "(తమిళ ), మోహన్ లాల్ "దృశ్యం 2 " మూవీస్ లో నటిస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలోమోహన్ లాల్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మలయాళ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది. "దృశ్యం "మూవీ పలు భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.