
ట్యాగ్ · 3 కథనాలు


సింగీతం దర్శకత్వంలో అనుష్క?
ప్రముఖ గాయని బయోపిక్ తో రానున్న సింగీతం..!

కమల్ హాసన్ కు జోడీగా అనుష్క ?
బ్లాక్ బస్టర్ "భాగమతి" మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ విడుదల కు సిద్ధంగా ఉంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న "నిశ్శబ్ధం" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది. కరోనా వైరస్ కారణంగా పలు మూవీస్ తో పాటు , ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడింది. అనుష్క పై ఇప్పుడు ఒక ఆసక్తికర న్యూస్ ,అనుష్క ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

సింగీతం దర్శకత్వంలో అనుష్క?
లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మళ్ళీ మెగాఫోన్ పట్టబోతున్న సంగతి తెలిసిందే. స్వర్గీయ గాయని బెంగళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా ఆయన ఓ బయోపిక్ రూపొందించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో నాగరత్నమ్మ పాత్రలో లేడీ సూపర్ స్టార్ అనుష్కా శెట్టి నటించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్. త్వరలోనే ఈ బయోపిక్, స్వీటీ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
ప్రముఖ గాయని బయోపిక్ తో రానున్న సింగీతం..!
సింగీతం శ్రీనివాసరావు అంటే మనకి వెంటనే గుర్తొచ్చే సినిమా పేరు పుష్ఫకవిమానం. ఆయన సినీ కెరీర్ లో పుష్ఫకవిమానం, ఆదిత్య 369, విచిత్ర సోదరులు లాంటి ఎన్నో గొప్ప సినిమాలను అందించారు. ఆయన చివరిగా వెల్ కమ్ ఒబామా అనే సినిమా తీసారు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు డైరెక్షన్ చేయడానికి ముందుకొస్తున్నారు. కొత్త కొత్త కథలతో.. కొత్త కొత్త దర్శకులు.. ఎంతో మంది సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఈ వయసులో.. ఇన్నేళ్ల తర్వాత మరోసారి దర్శకత్వం చేయడానికి రెడీ అయ్యారు.