
ట్యాగ్ · 4 కథనాలు

అల్లు అర్జున్ కు మారుతి ప్రత్యేక అభినందనలు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప :ది రైజ్"మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ "పుష్ప :ది రూల్ "మూవీ కి ప్రిపేర్ అవుతున్నారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన "పక్కా కమర్షియల్ "మే 20 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు మారుతి ఎప్పటినుంచో స్నేహితులు అన్న విషయం తెలిసిందే."పుష్ప :ది రైజ్"మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న అల్లు అర్జున్ ను దర్శకుడు మారుతి కలిసి ప్రత్యేకం గా అభినందనలు తెలిపారు.
మారుతి కూతురి టాలెంట్ - హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అభినందనలు..!
డైరెక్టర్ మారుతి పుత్రికోత్సాహంలో ఉన్నాడు ప్రస్తుతం. దీనికి కారణం తన కూతురి ఫొటోగ్రఫీనే కారణం. మారుతి కూతురు హియాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. తను తీసిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంటుంది. అలా తాను రీసెంట్ గా తీసిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వాటికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్ లైక్ చేసి, హియాను ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈ విషయాన్ని మారుతి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ తన కూతురి టాలెంట్ కి పొంగిపొతున్నారు. తన కూతురు విషయంలో గర్వంగా ఫీలవుతున్నట్లు ట్వీట్ చేసి తన ఆనందం వ్యక్తం చేశాడు. డ్యాన్ సినిమాటోగ్రఫీ అందించిన సినిమాల్లో…
నానితో మరోసారి మారుతి
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `భలే భలే మగాడివోయ్` (2015) ఒకటి. యూత్ ఫుల్ సినిమాల స్పెషలిస్ట్ మారుతి రూపొందించిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్.. అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది. ఇంతటి ఘనవిజయం సాధించిన ఆ చిత్రం తరువాత నాని, మారుతి మళ్ళీ జట్టుకట్టనేలేదు. అయితే, త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుందని సమాచారం.

మరోసారి మెగా హీరోతోనే..?
హర్రర్ లో కూడా కామెడీని ఎలా పండించాలో చూపించిన దర్శకుడు మారుతి. తన కామెడీ టైమింగ్ తో హీరోలతో మంచి కమెడీ చేయించి హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గా మెగా హీరో సాయితేజ్ తో 'ప్రతిరోజూ పండగే' సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుత జనరేషన్ లో మెకానికల్ లైఫ్ కి అలవాటు పడ్డ పిల్లలు తమని ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లితండ్రులను మరిచిపోతున్నారన్న నేపధ్యంలో చక్కటి కుటుంబ సన్నివేశాలతో సినిమాని తెరకెక్కించాడు మారుతి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంది.