
ట్యాగ్ · 6 కథనాలు


దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ ..

దసరా మూవీ ఉగాది స్పెషల్ పోస్టర్

నేను ఇంకా 73 కథలు వినాలి

దసరా సాలిడ్ ప్రమోషన్ ప్లాన్

ప్రారంభం అయిన దసరా మూవీ బుకింగ్స్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.దసరా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్ ..
న్యాచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రచార చిత్రాల వల్ల ఇప్పటికే ఈసినిమాకు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని నాని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. సోలో గా రిలీజ్ అవుతుండడం కూడా సినిమాకు కలిసిరానుంది. దాంతో మొదటి రోజు ఈసినిమాతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నాని సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ గా వున్నాడు. గత కొన్ని రోజులుగా సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తూ ఇతర భాషల్లో కూడా బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా దసరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను…

దసరా సిబ్బందికి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన కీర్తి సురేష్
నాని ,కీర్తి సురేష్ జంటగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ దసరా విడుదలకు సిద్దమవుతుంది.అందులో భాగంగా ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా వున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ఒక్క తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ,దసరా కు పనిచేసిన సిబ్బందికి గోల్డ్ కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. దాదాపు 130మందికి గాను కీర్తి ,ఒక్కొక్కరికి 10గ్రాముల గోల్డ్ కాయిన్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని సమాచారం. వీటి మొత్తం విలువ సుమారు 70నుండి 75 లక్షల వరకు వుంటుందట. షూటింగ్ లో తనకు సహకరించిన సిబ్బందికి ఏదోకటి ఇవ్వాలని భావించిన కీర్తి,గోల్డ్ కాయిన్స్ ను బహుమానంగా ఇచ్చిందట.

దసరా మూవీ ఉగాది స్పెషల్ పోస్టర్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. సాయి కుమార్, షైన్ టామ్ చాకో, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

నేను ఇంకా 73 కథలు వినాలి
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమా దసరా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రఫ్ అండ్ రస్టిక్ లుక్ తో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాతో నాని అలరించడానికి వస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పెంచిన క్యూరియాసిటీని ఇప్పటివరకూ ఎక్కడా తగ్గించలేదు. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచాయి తప్పా.. తగ్గించలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

దసరా సాలిడ్ ప్రమోషన్ ప్లాన్
న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు మేకర్స్. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక వరుసగా పాటలను కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.