ట్యాగ్ · 3 కథనాలు
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020
ఆర్ ఆర్ ఆర్ , కాంతార మూవీస్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2023 వేడుక నిన్న ముంబై లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ , రికార్డ్ కలెక్షన్స్ సాధించిన కాంతార మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా అవార్డ్ సొంతం చేసుకున్నారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై నవీన్ పోలిశెట్టి ఫన్నీ మెసేజ్
స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ''ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'' మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ''ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ''చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తనదైన శైలి యాక్టింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ లో నవీన్ నటనకు గానూ 'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' తెలుగు కేటగిరీలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపికయ్యారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ సౌత్ 2020 లో టాలీవుడ్లో గెలుచుకున్న అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ "ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. "జెర్సీ "మూవీ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ గెలుచుకుంది. సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ"మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరో నవీన్ పోలిశెట్టి బెస్ట్ యాక్టర్ గా ఎంపిక అయ్యారు.