
ట్యాగ్ · 4 కథనాలు


అఫీషియల్.. 'మెగా స్టార్ 154' లో క్రాక్ భామ..!

"చిరంజీవి 154 "మూవీ లో బాబీ సింహా

'హనుమాన్' తో 'రామ రాజు'..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నారు. ఈసినిమాతో ఒక్క సారిగా పాన్ ఇండియా స్టార్ రేసులోకి చరణ్ కూడా వచ్చేశాడు. మల్టీస్టారర్ గా వచ్చిన ఈసినిమాలో రామ్ చరణ్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా చరణ్ కు మంచి క్రేజ్ పెరిగింది. మరోవైపు తండ్రి మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ నెల 29న ఈసినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఫీషియల్.. 'మెగా స్టార్ 154' లో క్రాక్ భామ..!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను పట్టాలెక్కించేశాడు. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు చేరుకున్నట్టే. ఈసినిమాతో పాటు పార్లల్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు.

"చిరంజీవి 154 "మూవీ లో బాబీ సింహా
మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్ ", మెహెర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్ ", బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో "చిరంజీవి 154 "మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.

జగన్ మరోసారి ఆలోచిస్తానన్నారు.. ఎవరూ మాట్లాడొద్దు..!
సినిమా టికెట్ల ధరల విషయంలో కొన్నినెలలుగా సినిమా ఇండస్ట్రీకి, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదాలు తలెత్తున్న సంగతి తెలిసిందే కదా. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ జీవో జారీ చేయడంతో సమస్యలు మొదలయ్యాయి. ఇక ఇప్పటికే దీనిపై చాాలా చర్చలు కూడా జరిగాయి. ఈనేపథ్యంలో నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక జగన్ తో చిరు భేటీ ముగిసింది.