ట్యాగ్ · 4 కథనాలు
ఆచార్య లో 'చిరు' తో సమానంగా 'చెర్రీ'
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?
'కాజల్' దంపతులకు 'చిరు' బ్లెస్సింగ్స్
కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. 'ఆచార్య' చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ ఇన్ని రోజులు పెళ్లి... హనీమూన్ కోసం మాల్దీవ్స్ అంటూ చాలా బిజీ బిజీ గా వుంది.
ఆచార్య లో 'చిరు' తో సమానంగా 'చెర్రీ'
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్..?
కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ఆచార్య సినిమా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రెండుమూడు రోజుల క్రితమే ఈ సినిమా కథపై ఆరోపణలు వచ్చాయి. వాటికి చిత్రయూనిట్, కొరటాల క్లారిటీ ఇచ్చారనుకోండి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేసింది రీసెంట్ గానే. ఓఇంటర్వ్యూ లో పాల్గొన్న రామ్ చరణ్ తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టు.. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి కోరిక తీరుతున్నట్టు చెప్పాడు. ఇక ఇదిలా వుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
'చిరు 152' ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
చిరు పుట్టినరోజు కు ఇంకా నాలుగు రోజులు టైం ఉండగానే సోషల్ మీడియాలో అప్పుడే హంగామా మొదలైంది. ఇప్పటికే చిరు పుట్టినరోజుకు ఏదో ఒకటి కొత్తగా చేయాలన్న ఆలోచనతో కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 65 మంది సినీ ప్రముఖులతో చిరు కామన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక కామన్ డీపీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు.