కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Check Movie Telugu

ట్యాగ్ · 6 కథనాలు

సినిమా వార్తలు

'చెక్' ఇంట్రెస్టింగ్ పాయింట్స్

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌, రకుల్ ప్రీత్, ప్రియా వారియర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం చెక్. ఈసారి నితిన్ పూర్తి ఎక్స్ పెరిమెంటల్ మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లలో ఆ విషయం అర్ధమైంది. ఈసినిమా కూడా నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అర్థమవుతుంది. ఇక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలో.. ఈ సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే 'చెక్' సినిమా వెంటనే ఓకే చేశా

'ఒరు అదార్ ల‌వ్‌'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. మొదటి సినిమా అంత విజయం కాకపోయినా ప్రియా మాత్రం వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇక తెలుగులో చెక్ లాంటి మరో విభిన్నమైన సినిమాతో వచ్చేస్తుంది. ఇది ప్రియా ప్రకాష్ కు డైరెక్ట్ తెలుగు ఫిలిం. మరి ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రియా ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈవారం సందడి చేయనున్న సినిమాలు

ఈ ఫిబ్రవరి నెల సినిమాల సందడితోనే ముగిసిపోనుంది. నిజానికి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ లు పెద్దగా పెట్టుకొనేవారు కాదు దర్శకనిర్మాతలు. వస్తే వాలెంటైన్స్ డే కి ఒకటో రెండో సినిమాలు వచ్చేవి. సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత సమ్మర్లో సినిమాల సందడి మొదలవుతుంది. కానీ గత ఏడాది కరోనా వల్ల థియేటర్స్ లేకపోవడంతో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. ఇక థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వీలైనంత త్వరగా రిలీజ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి రిలీజ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం వరుస రిలీజ్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడిగా మారింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాణ సంస్థకు 'చెక్' నైజాం హక్కులు

చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా చెక్. చాలా డిఫరెంట్ కథతో వస్తున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాతో మరో హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడన్న అభిప్రాయానికి వస్తున్నారు అందరూ . ఇక ఈ ఎఫెక్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా పడింది. టీజర్ కు ట్రైలర్ కు మంచి టాక్ వచ్చి సినిమాపై అంచనాలు పెరిగితే ఆ సినిమా హక్కులు కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోతాయన్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు చెక్ విషయంలో కూడా అదే జరిగింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చెక్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. ఇక ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకటి రంగ్ దే కాగా.. మరొకటి చెక్. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'చెక్'. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'చెక్' - ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్

ఈ ఏడాది హీరో నితిన్‌ హీరోగా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. అందులో ‘రంగ్‌ దే’ సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ సినిమా తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్