
ట్యాగ్ · 4 కథనాలు

'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ కామెడీ సీన్స్
ఎలుక మజాకా - 'వెన్నెల కిషోర్' కామెడీ సీన్

బ్రహ్మానందం గీసిన అద్భుతమైన చిత్రాలు
బ్రహ్మనందం...పరిచయం అక్కర్లేని పేరు.దాదాపు 1250కు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఈ లెజండరీ కమెడియన్.అంతేకాదు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.ఉత్తమ హాస్య నటుడిగా 5సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ కూడా ఆయనే.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. బ్రహ్మనందం మల్టీ ట్యాలెంటెడ్.ఒక్క నటనే కాదు ఆయన మంచి చిత్రకారుడు అని కూడా మనకు తెలుసు.వయసు పైబడిన కారణంగా గతకొంత కాలంగా సినిమాలు తగ్గించేసారు దాంతో తనలోని ఆర్టిస్టు ను బయటికి తీశారు.ఇటీవల బ్రహ్మానందం వేసిన కొన్నిపెయింటింగ్స్ బాగా పాపులర్…

'మాయదారి మోసగాడు' - బ్రహ్మీ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్
తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇక ఇప్పుడు 'మాయదారి మోసగాడు' సినిమాలో బ్రహ్మీ కామెడీ సీన్స్ మీకోసం.. కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.
'ఫస్ట్ ర్యాంక్ రాజు' మూవీ కామెడీ సీన్స్
కన్నడలో సూపర్ హిట్ అయిన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. కన్నడలో డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నరేష్ కుమార్ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కింది. చేతన్ మద్దినేని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో కషిష్ వొహ్రా, ప్రకాష్ రాజ్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేష్, నరేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డాల్ఫిన్స్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై మంజునాథ్ వి కందుకూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కిరణ్ రవింద్ర నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా కామెడీ సీన్స్ మీకోసం
ఎలుక మజాకా - 'వెన్నెల కిషోర్' కామెడీ సీన్
వెన్నెల సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి...సినిమా పేరునే ఇంటిపేరుగా తెచ్చుకున్న కమెడియన్ వెన్నెల కిషోర్. ఫెరెంట్ మాడ్యులేషన్.. మొహంలోనే కనిపించే ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్.. మధ్యమధ్యలో విచిత్రమైన ఇంగ్లీష్ పదాలు.. అద్భుతమైన కామెడీ టైమింగ్.. ఇవన్నీ ఈయన సొంతం. వెండితెర మీద విభిన్న పాత్రలతో మెరుస్తోన్న వెన్నెల కిషోర్.. అనేక సినిమాల్లో తన దైన కామెడీ పండించారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కెమెడియన్లలో ఒకరిగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.