
ట్యాగ్ · 65 కథనాలు · పేజీ 4


తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న అకీరా

"AK " రీమేక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్-రానా సినిమా మేకింగ్ వీడియో రిలీజ్

పవన్ సినిమా టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
పవన్-రానా కాంబినేషన్ లో మలయాళం సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఈసినిమాలో పవన్ పోలీస్ అధికారి భీమ్లా నాయక్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. భీమ్లా నాయక్ అంటూపవన్ కళ్యాణ్ పాత్ర పేరును రివీల్ చేసిన క్షణం నుంచి సినిమా మీద మరింత బజ్ ఏర్పడింది. ఇక సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ఇటీవలే రిలీజ్ అయి ఎంత వైరల్ అయిందో చూశాం. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుండి తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.

తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న అకీరా
పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈనేపథ్యంలో ఇప్పుడు మరోసారి అకీరా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. దీనికి కారణం రేణు దేశాయ్ అకీరాకు సంబంధించిన ఒక వీడియోను ఇన్ట్సాలో పోస్టే చేయడమే. తాజాగా అకీరానందన్ కర్ర సాము చేస్తున్న ఒక వీడియోని రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అకీరా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ అకీరాని కొనియాడుతున్నారు.

"AK " రీమేక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలోమలయాళ సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

పవన్ పై రానా ప్రశంసలు.. చాలా విషయాలు నేర్చుకుంటున్నా
టాలీవుడ్ లో ప్రస్తుతం పలు మల్టీ స్టారర్ సినిమాలు వస్తుండగా అందులో పవన్ కళ్యాణ్-రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ సినిమాపై కూడా స్పెషల్ క్రేజ్ ఉంది. పవర్ స్టార్ అంటేనే సూపర్ క్రేజ్ ఉంటుంది.. దానికితోడు రానా లాంటి టాలెంటెడ్ నడుట కూడా నటిస్తుండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా రీసెంట్ గానే షూటింగ్ ను ప్రారంభించారు. ఇక తాజాగా ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా దీంతో పవర్ స్టార్ క్రేజ్ ఏంటో మరోసారి అర్థమవుతుంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పవన్-రానా సినిమా మేకింగ్ వీడియో రిలీజ్
అజ్ఞాతవాసి సినిమా తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు రాజకీయాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడో లేదో అనుకున్నారు. కానీ 'వకీల్ సాబ్' సినిమా తో మళ్లీ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చాడు. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా.. ఇప్పుడు ఒక్కొక్కటిగా షూటింగ్ ను ఫినిష్ చేయడానికి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడ్డ `అయ్యప్పనుమ్ కోషియుమ్` తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు పవన్ స్టార్.