
ట్యాగ్ · 3 కథనాలు


పొంగల్ రేసు నుండి తప్పుకున్న 'భీమ్లానాయక్'

ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తో "భీమ్లానాయక్ "
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

'భీమ్లా నాయక్' రివ్యూ.. పవన్ నట విశ్వరూపం..!
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రతి వర్గం తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. పవన్-రానా ల పెర్ఫామెన్స్, త్రివిక్రమ్ రైటింగ్, సాగర్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి ఫర్ఫెక్ట్ గా సెట్ అయి వచ్చిన ఈసినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకునే సినిమా ఇది.

పొంగల్ రేసు నుండి తప్పుకున్న 'భీమ్లానాయక్'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. గతకొద్ది కాలంగా వస్తున్న వార్తలే నిజమయ్యాయి. అసలు సంగతేంటంటే.. రీఎంట్రీ తరువాత పవర్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది వకీల్ సాబ్ తో అలరించగా పలు సినిమాలను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అందులో ఒక సినిమా భీమ్లానాయక్. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన పవన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచేశారు. దానికి తోడు టీజర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో ఈసినిమా కోసం అటు పవన్…