
ట్యాగ్ · 3 కథనాలు


బెదురులంక 2012 గ్లింప్స్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా నుండి తాజాగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్రామంలో జరిగే ఫన్నీ, సీరియస్ ఎలిమెంట్స్ తో పాటుగా సస్పెన్స్ ను కూడా గ్లింప్స్ లో చూడచ్చు. గ్లింప్స్ అయితే సినిమాపై ఆసక్తిని పెంచేస్తుంది.

బెదురులంక 2012 నేహా శెట్టి లుక్ రిలీజ్
క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. బెదురులంక 2012 అనే టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఓ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా నుండి నేహాశెట్టి లుక్ ను రిలీజ్ చేశారు. నేడు నేహా శెట్టి పుట్టిన రోజు సందర్భంగా తన లుక్ ను రిలీజ్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. లేటెస్ట్గా రిలీజైన పోస్టర్లో నేహా…

కార్తికేయ బెదురులంక 2012 మూవీ ఇంటెన్స్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో కార్తికేయ మరో న్యూ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సి .యువరాజు సమర్పణలో లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వం లో కార్తికేయ హీరోగా బెదురులంక 2012 మూవీ తెరకెక్కుతుంది.గోదావరి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ కాగా అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.