
ట్యాగ్ · 3 కథనాలు


'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వాయిదా పడ్డ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’
విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక టీజర్ ను బట్టి కథాంశం ఏంటో అర్థమైపోయింది. ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ప్రస్తుతం విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా కూడా ఒకటి. విద్యాసాగర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ఈసినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్ కుమార్‌గా అలరించనున్నాడు విశ్వక్. ప్రస్తుతం ఆయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు.. అలాగే ఒక పాటను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

'అశోక వనంలో అర్జున కళ్యాణం' షూటింగ్ స్టార్ట్ చేసిన విశ్వక్
యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కిన పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ కు ఆ సినిమా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో ఇప్పుడు మరో సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు.