
ట్యాగ్ · 3 కథనాలు

17 ఏళ్ల ఆర్య.. నా జీవితంలో పెద్ద మిరాకిల్

ఆర్య హీరోగా ఆవారా మూవీ సీక్వెల్ ?
దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో కార్తి, తమన్నా జంటగా తెరకెక్కిన రోడ్ డ్రామా పైయా తమిళ మూవీ, తెలుగు వెర్షన్ ఆవారా మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికీ స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. అప్పుడప్పుడూ ఈ మూవీ పాటలను ఎక్కడో ఓ చోట వింటూనో, పాడుకుంటూనే ఉంటారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత ఆవారా మూవీకి సీక్వెల్ చేయాలని దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేసినట్టు.. ఈ సీక్వెల్ లో కార్తీకి బదులుగా ఆర్య నటించనున్నట్టు, రీసెంట్‌గా కథ విన్న ఆర్య కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

ఆర్యన్ 'కెప్టెన్' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ హీరోలు ఇప్పుడు అందరూ తెలుగులో కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫలితాల సంగతి పక్కన పెడితే తెలుగులో కూడా తమ మార్కెట్ ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఇక ఇప్పుడు ఆర్యన్ కూడా కెప్టెన్ అనే సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. ఆర్యన్ తెలగు ప్రేక్షకులకు సుపరిచితుడే. బన్నీ వరుడు సినిమాతో తెలుగులో ప్రతినాయక పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు ఆర్యన్. అయితే ఆ తరువాత తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు. అయితే రాజా రాణి డబ్బింగ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా…
17 ఏళ్ల ఆర్య.. నా జీవితంలో పెద్ద మిరాకిల్
ఆర్య... సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎప్పుడూ ఈసినిమా ప్రెష్ ఫీలింగ్ నే ఇస్తుంది. సుకుమార్ డైరెక్షన్ ,కథ, బన్నీ యాక్టింగ్.. మరోవైపు దేవి మ్యూజిక్ అన్నీ ఈసినిమాకు కలిసొచ్చాయి. 2004లో సినిమా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవడమే కాదు.. అల్లు అర్జున్, సుకుమార్‌లను స్టార్స్‌గా మార్చేసింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈసినిమాలో బన్నీ చెప్పే ఫీల్ మై లవ్ అనే పదాలకు అప్పట్లో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అంతేకాదు ఈసినిమా ట్రెండ్ సెట్టర్ గా కూడా నిలిచింది. ఇక అను మెహతా హీరోయిన్ గా నటించగా.. శివ బాలాజీ మరో కీలక పాత్రలో నటించాడు.