
ట్యాగ్ · 3 కథనాలు

సైంధవ్ లో తమిళ హీరో
ఎఫ్ 3 తరువాత విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం సైంధవ్. ఇది ఆయనకు 75వ సినిమా కావడం విశేషం.హిట్ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో తమిళ హీరో ఆర్య ఓ కీలక మైన పాత్రలో మానస్ అనే పేరు తో కనిపించనున్నాడు.కొద్దిసేపటి క్రితం ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈపోస్టర్ లో లాంగ్ హెయిర్ తో చేతిలో గన్ పట్టుకొని కనిపించాడు ఆర్య.ఈ ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.

ఆర్య హీరోగా ఆవారా మూవీ సీక్వెల్ ?
దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంలో కార్తి, తమన్నా జంటగా తెరకెక్కిన రోడ్ డ్రామా పైయా తమిళ మూవీ, తెలుగు వెర్షన్ ఆవారా మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికీ స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. అప్పుడప్పుడూ ఈ మూవీ పాటలను ఎక్కడో ఓ చోట వింటూనో, పాడుకుంటూనే ఉంటారు. దాదాపు 13 సంవత్సరాల తరువాత ఆవారా మూవీకి సీక్వెల్ చేయాలని దర్శకుడు లింగుస్వామి ప్లాన్ చేసినట్టు.. ఈ సీక్వెల్ లో కార్తీకి బదులుగా ఆర్య నటించనున్నట్టు, రీసెంట్‌గా కథ విన్న ఆర్య కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

రామ్ కు విలన్ గా..!
ఒకప్పుడు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ ఈ మధ్య ఫుల్ మాస్ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో అలరించిన రామ్.. ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమాలో కూడా అదే కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘రాపో 19’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. నిన్నటి నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఇప్పటికే ఈసినిమాకు 'ఉస్తాద్' అనే పేరును చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాలో నటించే విలన్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలోనే తమిళ్ స్టార్ హీరో మాధవన్ హీరోగా నటిస్తున్నాడని…