
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

'తలైవి' రిలీజ్ డేట్ ఫిక్స్
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఆమధ్య ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఖచ్చితంగా ఈసినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. తమిళనాడులో సైతం యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 10న…

'నవరస' ట్రైలర్ రిలీజ్
ఒక స్టార్ డైరెక్టర్.. ఒక స్టార్ హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది మణిరత్నం లాంటి డైరెక్టర్.. ఒకరు కాదు ఇద్దరు కాదు తమిళ్ లో ఉన్న పలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్ అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కించగా... ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో నటుడు ప్రత్యేక పాత్రలో నటించారు.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"తలైవి "న్యూ లుక్
విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా -జయలలిత , అరవింద్ స్వామి -ఎమ్ జి ఆర్ , ప్రకాష్ రాజ్ -కరుణానిధి , జానకి రామచంద్రన్ -మధుబాల , పూర్ణ -శశికళ , భాగ్యశ్రీ – జయలలిత మదర్ సంధ్య పాత్రలలో నటించారు.