
ట్యాగ్ · 3 కథనాలు

నాని 'అంటే సుందరానికీ' మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా ఖచ్చితంగా అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాకు బాగా కనెక్ట్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రమోషన్స్ తో బిజీగా హీరో నాని
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.
నాని 28 టైటిల్ రిలీజ్
బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ రోజు ఈ సినిమా నుండి సర్ ప్రయిజింగ్ అప్ డేట్ ఇస్తామని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇక చెప్పినట్టే ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు 'అంటే సుందరానికి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.