
ట్యాగ్ · 3 కథనాలు


మూవీ ఫీచర్ ఆర్టికల్: "అన్నమయ్య "

సీనియర్ నటుడు 'బాలయ్య' కన్నుమూత..!
ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా విషాద ఛాయలు అలుముకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలను కోల్పోయింది ఇండస్ట్రీ. ఈ ఏడాది.. ఈ నాలుగు నెలల కాలంలోనే సీనియర్ నడుటు శరత్, ప్రముఖ గేయ రచయిత కందికొండ, ప్రముఖ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి లాంటి వాళ్లను కోల్పోయింది పరిశ్రమ. ఇక ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. మరో సీనియర్ నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య నేడు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా వయసు రీత్యా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు తన నివాసంలో కన్నుముశారు. ఇక బాలయ్య మరణానంతరం ఇండస్ట్రీ నుండి పలువురు ఆయనకు సంతాపం తెలియచేస్తున్నారు.

మూవీ ఫీచర్ ఆర్టికల్: "అన్నమయ్య "
15 వ శతాబ్దపు స్వరకర్త అన్నమాచార్య జీవిత చరిత్ర ఆధారంగా కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా రూపొందిన బయోగ్రాఫికల్, డివోషనల్ మూవీ "అన్నమయ్య " 1997 సంవత్సరం మే 22 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మోహన్ బాబు , సుమన్ , రమ్యకృష్ణ , రోజా , భానుప్రియ , కస్తూరి , బ్రహ్మానందం వంటి భారీ తారాగణం తో తెరకెక్కిన "అన్నమయ్య " మూవీ కి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను వీనుల విందు చేశాయి.

నాగార్జున తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’కు 23 ఏళ్ళు
వాణిజ్యపరమైన సినిమాలతోనే కాదు.. ఆధ్యాత్మిక చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరించిన వైనం ‘కింగ్’ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ద్వయం సొంతం. అలాంటి వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’. తన కీర్తనలతో ఆ పరంధాముడి హృదయ సామ్రాజ్యాన్నే ఏలిన కవి మహారాజు ‘అన్నమయ్య’ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. అటు నాగార్జునకు, ఇటు దర్శకేంద్రుడికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ, కస్తూరి నటించగా.. శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ దర్శనమిచ్చారు. ఇక శ్రీదేవి, భూదేవిగా భానుప్రియ, శ్రీకన్య కనిపించారు. డా.మోహన్‌బాబు, రోజా, బాలయ్య, శుభ…