
ట్యాగ్ · 3 కథనాలు

"హిడింబ" మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
సక్సెస్ ఫుల్ "రాజు గారి గది 3 " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అశ్విన్ బాబు మరొక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "హిడింబ " మూవీ తెరకెక్కుతుంది. నందిత శ్వేతా కథానాయిక కాగా రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే వరుసగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అర్జున్, అలానే విలన్ పాత్రలో చేస్తున్నఅనూప్ సింగ్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. అయితే ఈసినిమాలో కూడా రవితేజకి అత్త పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక అనసూయ పోస్టర్…

అనసూయకు అభిమానుల బర్త్ డే విషెస్
మాటలతోనే కాకుండా , తన అందచందాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనసూయ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. .టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.