
ట్యాగ్ · 3 కథనాలు

న్యూ లుక్ లో అనసూయ
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ తన ఆసక్తికర యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న అనసూయ బ్లాక్ బస్టర్ "రంగస్థలం" మూవీ లో రంగమ్మత్త క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "యాత్ర ", "కథనం " మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.
బాలీవుడ్ లోకి అనసూయ..!
బుల్లితెరపై టాప్ యాంకర్ లు ఎవరంటే ఆ లిస్ట్ లో యాంకర్ అనసూయ పేరు ఖచ్చితంగా ఉంటది. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. ఇక బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయకు లక్ బాగానే కలిసొచ్చింది. క్షణం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత వచ్చిన రంగస్థలంలోని రంగమత్త పాత్ర మాత్రం సినీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. రంగమ్మత్త క్యారెక్టర్ తో అనసూయ బదులు రంగమ్మత్త అని పిలుచుకునేంత బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అనసూయకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, ఆమె బుల్లితెరను వదిలేయకుండా కెరియర్ ను చక్కగా…

#PSPK 27 లో అనసూయ ?
సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాతగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ మూవీ #PSPK 27 రూపొందనున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రూపొందనున్న ఈ మూవీ ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ బాలీవుడ్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.