
ట్యాగ్ · 3 కథనాలు


పవన్ ఫ్యాన్ కు న్యూ ఇయర్ ట్రీట్-ఖుషి రీ రిలీజ్

'హరిహర వీరమల్లు'.. పవన్ తో మేకర్స్ మీటింగ్

పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రీ రిలీజ్ రికార్డ్
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎస్.జె.సూర్య దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ , భూమిక జంటగా తెరకెక్కిన ఖుషి మూవీ 2001 ఏప్రిల్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరించారు. మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పుడు ఖుషి మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది. 4కే రిజల్యూషన్ లో 5.1 డాల్బీ ఆడియో క్వాలిటీతో ఖుషి మూవీ న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 31వ తేదీ రీరిలీజ్ కానుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.

పవన్ ఫ్యాన్ కు న్యూ ఇయర్ ట్రీట్-ఖుషి రీ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సినిమా ఏదంటే అందరికీ ఖుషి సినిమానే ముందు గుర్తొస్తుంది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా పవర్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇందులో పవన్ మ్యానరిజం, స్టైల్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సూపర్. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా .. ఎప్పుడూ గొడవ పడే పాత్రల్లో ఇద్దరూ చేసిన నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది.

'హరిహర వీరమల్లు'.. పవన్ తో మేకర్స్ మీటింగ్
ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమతో అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో భీమ్లా నాయక్ సినిమా, హరి హర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈరెండు సినిమాలు అయితే సెట్స్ మీద ఉన్నాయి. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందే పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు.. దాని తరువాత భీమ్లా నాయక్ ను స్టార్ట్ చేశాడు. అయితే కరోనా వల్ల రెండు సినిమాలకు బ్రేక్ పడగా.. భీమ్లా నాయక్ సినిమా మాత్రం ముందు షూటింగ్ ను రీ స్టార్ట్ చేసింది.ఇక ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోవడమే కాకుండా.. వరుస అప్ డేట్స్ కూడా ఇస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం…