
ట్యాగ్ · 4 కథనాలు

నాకు నెగిటివ్ హ్యాపీ
బీ లోకల్ బీ వోకల్ - అల్లు శిరీష్
'జీవితం తలకిందులైపోయింది' అందుకే ఇలా..!

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్
రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు శిరీష్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. అంతేకాదు.. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా తెలిపాడు.
నాకు నెగిటివ్ హ్యాపీ
మెగా హీరోస్ చరణ్, వరుణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో వారితో ఉన్న వారందరూ ఇప్పుడు టెస్ట్ లు చేయించుకునే పనిలో వున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ కూడా టెస్ట్ లు చేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు అల్లు శిరీష్. 'రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాను.. రెండు సార్లూ నెగిటివే అని వచ్చింది.. ఈ విషయం తెలపడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని ట్వీట్ చేసాడు. అంతేకాదు ఈ కోవిడ్ గురించి మీకు కొన్ని సూచనలు మాత్రం చేయాలనుకుంటున్నాను..'' అని పలు విషయాలు పంచుకున్నాడు.
బీ లోకల్ బీ వోకల్ - అల్లు శిరీష్
"కొత్త జంట ", "శ్రీరస్తు శుభమస్తు ", "ABCD" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా "బీ లోకల్ బీ వోకల్" అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణం గా దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్న మయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశీయ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది.
'జీవితం తలకిందులైపోయింది' అందుకే ఇలా..!
మొత్తానికి కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసింది. దెబ్బకు అందరూ ఇంటి నుండి బయటకు రావడానికి భయపడేలా చేసింది. కనీసం ఒకరినొకరు పలకరించుకునే ఉరుకుల పరుగుల జీవితం.. కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేనంత బిజీ..ఈ కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమిత మయ్యారు. అందరికీ తమ కుటుంబాలతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దక్కింది. ముఖ్యంగా సెలెబ్రిటీస్ కు ఇది బాగా కలిసొచ్చింది. వాళ్ళది మరీ బిజీ లైఫ్ కదా.