
ట్యాగ్ · 4 కథనాలు

అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్

అల్లు అర్జున్ భారీ విరాళం... కేరళకు కూడా

అభిమానులకు బన్నీ రిక్వెస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సంచలన విజయాన్ని అందించింది. ఈసినిమాతోనే పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే దేశవ్యాప్తంగా తన ఇంపాక్ట్ ను చూపించాడు. ఎంతోమంది ఫ్యాన్స్ ను సైతం దక్కించుకున్నాడు. ఇక మొదటిపార్ట్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై పడింది. ఇక ఆదిశగానే షూటింగ్ కూడా జరుగుతుంది. సుకుమార్ సాలిడ్ కథనే తయారుచేశాడంటున్నారు.
అల్లు అర్జున్ పై బాలీవుడ్ నిర్మాత , దర్శకుల ప్రశంసలు
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ పలు విధాల నష్టపోయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన్న అన్ని భాషల చిత్రాలు విడుదల వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ కోలుకుంటుంది . "వరుడు కావలెను " మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ .. కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందనీ , ఇప్పుడిప్పుడే మహమ్మారి ప్రభావం తగ్గడంతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు థియేటర్లోకి వస్తున్నారనీ , ఇప్పటి నుంచి భారత సినీ పరిశ్రమలో అన్ని పెద్ద పెద్ద సినిమాలే రాబోతున్నాయనీ , అన్ని ఇండస్ట్రీల వారు బాగుండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా.. ఈ కాంబినేషన్ పై ఇప్పటినుండి కాదు గత కొద్దిరోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా ఫిక్స్ అయిందని... త్వరలో అప్ డేట్ కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ కాంబినేషన్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనుమానాలన్నిటికి బ్రేక్ వేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు. బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

అల్లు అర్జున్ భారీ విరాళం... కేరళకు కూడా
కరోనా ను అరికట్టేందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇళ్లల్లో నుండి బయటకు రావొద్దని చెపుతూనే... ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఇంకా వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు మన టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్త, పలువురు డైరెక్టర్స్ విరాళాలు ప్రకటించగా.... ఇప్పుడు వీరి ఖాతాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తనవంతుగా మొత్తం రూ.1.25 కోట్ల సాయాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.