
ట్యాగ్ · 103 కథనాలు · పేజీ 6

మాస్ కా బాప్ అనిపిస్తున్న 'పుష్ప రాజ్'
తగ్గేదేలే.. బన్నీ పుష్ప సినిమాలో వాడే ఊత పదం అని ఇప్పటికే చెప్పారు.. ఇక బన్నీ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ చేసిన టీజర్ లో కూడా ఈ ఒక్క పదం మాత్రమే చూపించారు.. మరి టీజర్ చూసిన తరువాత నిజంగానే బన్నీ తగ్గేలా కనిపించడం లేదు. ఏదో పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్ర.. మేకోవర్ ఛేంజ్ చేశాడు కొత్తగా ఉంటుందేమో అనుకున్నారు కానీ టీజర్ చూసిన తరువాత బన్నీ మరో బ్లాక్ బస్టర్ కు రెడీ అవుతున్నాడు అన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మ్యూజికల్ హిట్ "గంగోత్రి " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఇంప్రెసివ్ యాక్టింగ్ , డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక.

'పుష్ప రాజ్' కు టైమ్ ఫిక్స్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పుష్ప'. శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.