
ట్యాగ్ · 3 కథనాలు


'చోర్ బజార్' లో సీనియర్ నటి.. 25 ఏళ్ల తరువాత ఎంట్రీ..!
బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి ఆంధ్రా పోరి, మెహబూబా సినిమాలతో హీరోగా పరిచయమయ్యాడు ఆకాష్ పూరి. ఇటీవల రొమాంటిక్ సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే మరో సినిమాతో బిజీగా ఉన్నాడు. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

"చోర్ బజార్"బ్యూటీ గెహన సిప్పీ ఫస్ట్ లుక్
ఐ.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై “దళం “, “జార్జ్ రెడ్డి “మూవీస్ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి , ముంబై మోడల్ గెహన సిప్పీ జంటగా యాక్షన్ఎంటర్ టైనర్ “చోర్ బజార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుబ్బా రాజు , అర్చన ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది.హీరో ఆకాష్ పవర్ ఫుల్ లుక్ లో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

"చోర్ బజార్ "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
"గబ్బర్ సింగ్ ", "బుజ్జిగాడు ", "చిరుత "వంటి పలు మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆకాష్ పూరి "ఆంధ్రాపోరి "మూవీ తో టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. "మెహబూబా "మూవీ తో ఆకాష్ ప్రేక్షకులను అలరించారు. ఆకాష్ కధానాయకుడిగా రూపొందిన"రొమాంటిక్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆకాష్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ "చోర్ బజార్ "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.