
ట్యాగ్ · 4 కథనాలు


అభిమానులకు అజిత్ స్పెషల్ మెసేజ్

అజిత్ 'వాలిమై' డబుల్ ధమాకా

అజిత్ 'వాలిమై' షూటింగ్ అప్ డేట్

పాన్ ఇండియా మూవీ గా "వాలి " రీమేక్
ఎస్ జె సూర్య దర్శకత్వంలో అజిత్ కుమార్ , సిమ్రాన్ , జ్యోతిక ముఖ్యపాత్రలలో సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "వాలి " తమిళ మూవీ 1999 ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ద్విపాత్రాభినయం చేసిన అజిత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "వాలి " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. 22 సంవత్సరాల తరువాత "వాలి " మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది.

అభిమానులకు అజిత్ స్పెషల్ మెసేజ్
"ఎన్ వీడు ఎన్ కనవర్ "మూవీ లో స్కూల్ బాయ్ గా కోలీవుడ్ కు పరిచయం అయిన అజిత్ , "అమరావతి "మూవీ తో హీరోగా మారారు. "ప్రేమ పుస్తకం "మూవీ తో అజిత్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. హీరో అజిత్ తెలుగు లో నటించిన ఏకైక మూవీ "ప్రేమ పుస్తకం "కావడం విశేషం. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అజిత్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్నారు. అజిత్ హీరోగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే.

అజిత్ 'వాలిమై' డబుల్ ధమాకా
హెచ్.వినోద్ దర్శకత్వంలోనే అజిత్ ప్రస్తుతం చేస్తున్న సినిమా వాలిమై. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ . ఇక ఈ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ సినిమా చాలా వరకు చిత్రీకరణ జరుపుకోగా. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ కు సిద్దమవుతుంది చిత్రయూనిట్.ఇక ఈసినిమా నుండి ఎంతో కాలంగా ఎలాంటి అప్ డేట్ లేని సంగతి తెలిసిందే కదా. అజిత్ బర్త్ డే కి అయినా ఫస్ట్ లుక్ వస్తుంది అనుకున్నారు కానీ అప్పుడు పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ చేయలేదు.

అజిత్ 'వాలిమై' షూటింగ్ అప్ డేట్
హెచ్. వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘వాలిమై’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఆయన పుట్టిన రోజుకు విడుదల కావాల్సిన ఫస్ట్ లుక్ ను కూడా ప్రస్తుతం పరిస్థితులు బాలేని నేపథ్యంలో రిలీజ్ చేయడం అంత బావుండదని మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ ను కూడా పోస్ట్ పోన్ చేశారు.