
ట్యాగ్ · 3 కథనాలు


అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'మేజర్'

డబ్బింగ్ పూర్తి చేసిన 'మేజర్'
టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే అందరి పాత్రల డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఇక రీసెంట్ గానే అడివి శేష్ ఈసినిమా డబ్బింగ్ ను మొదలుపెట్టగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు తన డబ్బింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తను వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా కూడా ఈసినిమా పనులు తన వల్ల లేట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో బిజీ షెడ్యూల్ లో కూడా తన డబ్బింగ్ ను పూర్తి చేసినట్టు చెబుతున్నాడు. ఇక హిందీలో కూడా అడివి శేష్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

అడివి శేష్ పై మహేష్ బాబు ప్రశంసలు
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో యాక్టర్ , డైరెక్టర్ , స్క్రీన్ రైటర్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శోభిత ధూళిపాళ , సయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.

ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'మేజర్'
కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ కు నోచుకోని సినిమాలు ఇంకా ఎన్నో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ వేవ్ అయిపోయింది కదా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు అనుకునే లోపే సెకండ్ వేవ్ వచ్చింది. దాంతో ఈరెండేళ్లలో ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి.. అందులో ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.. కొన్ని రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఫైనల్ గా అడివి శేష్ 'మేజర్' సినిమా కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. ఈసినిమా కంటే వెనుక మొదలైన సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈసినిమా ఇంకా షూటింగ్ ముగించుకునే పనిలోనే ఉంది. కరోనా వల్ల, ఇతర కారణాల వల్ల ఎన్నో సార్లు బ్రేక్ పడినా రీసెంట్ గానే…