
ట్యాగ్ · 3 కథనాలు


"అంధాధున్ " తమిళ రీమేక్ లో సిమ్రాన్ ?
ఇండస్ట్రీ హిట్ మూవీ :"కలిసుందాం .. రా ! "

విక్రమ్ 'మహాన్' టీజర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా మహాన్. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. ఇక తండ్రీకొడుకులిద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోవడంతో ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

"అంధాధున్ " తమిళ రీమేక్ లో సిమ్రాన్ ?
వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ , పిక్స్ మేకర్ స్టూడియోస్ , పిక్చర్ మేకర్ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా , రాధికా ఆప్టే జంటగా , సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో రూపొందిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ "అంధాధున్ " హిందీ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోయిన్ టబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ఇండస్ట్రీ హిట్ మూవీ :"కలిసుందాం .. రా ! "
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , సిమ్రాన్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "కలిసుందాం .. రా !" రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. "కలిసుందాం .. రా ! మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. తన దైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించి వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రేక్షకుల విశేషాదరణ పొందిన "కలిసుందాం .. రా !" మూవీ 70 సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.