ఇండస్ట్రీ హిట్ మూవీ :”కలిసుందాం .. రా ! “

Kalisundam Raa Remains One Of The Cleanest Family Entertainers Of Tollywood

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , సిమ్రాన్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ “కలిసుందాం .. రా !” రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. “కలిసుందాం .. రా ! మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. తన దైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించి వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రేక్షకుల విశేషాదరణ పొందిన “కలిసుందాం .. రా !” మూవీ 70 సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “కలిసుందాం .. రా ! “మూవీ 175 రోజులు 35 సెంటర్స్ , 200రోజులు 20 సెంటర్స్ లో ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎస్ ఏ రాజ్ కుమార్ స్వరకల్పనలో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ “నచ్చావే పాలపిట్టా ” సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన వెంకటేష్ , సిమ్రాన్ లతో పాటు లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు (గ్రాఫిక్స్ ) పెర్ఫార్మ్ చేసి
ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన “ప్రేమించుకుందాం రా “, “ప్రేమంటే ఇదేరా “, “కలిసుందాం .. రా ! “, “జయం మనదేరా ” మూవీస్ ఘనవిజయం సాధించడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.