ట్యాగ్ · 3 కథనాలు
సాయిశ్రీనివాస్ కి జోడీగా నభా నటేష్?
వరుణ్ సరసన ఇస్మార్ట్ భామలు..!
షూటింగ్స్ తో బిజీగా నభా నటేష్
సూపర్ హిట్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. "నన్ను దోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని గుర్తింపు పొంది పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.
సాయిశ్రీనివాస్ కి జోడీగా నభా నటేష్?
`ఇస్మార్ట్ శంకర్`తో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించింది కన్నడ కస్తూరి నభా నటేష్. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజకి జోడీగా `డిస్కో రాజా`లోనూ... `సుప్రీమ్` హీరో సాయితేజ్ కి జంటగా `సోలో బ్రతుకే సో బెటర్`లోనూ నాయికగా నటిస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే... మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ నభాకి అవకాశం దక్కిందని సమాచారం.
వరుణ్ సరసన ఇస్మార్ట్ భామలు..!
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా నుండే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో సినిమా కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.