
ట్యాగ్ · 3 కథనాలు


'రానా' ను సర్ ప్రైజ్ చేసిన 'ఖుష్బూ'

చిరంజీవి అద్భుతమైన స్నేహితుడు - ఖుష్బూ
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఖుష్బూ, మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా తెరకెక్కిన "స్టాలిన్ "మూవీ లో ఖుష్బూ ఓ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా ఏటా 80ల బ్యాచ్ అంటూ నిర్వహించే గెట్ టు గెదర్ ఫంక్షన్‌లో వీరు సందడి చేస్తూ ఉంటారు. తాజాగా సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ, చిరంజీవి ని కలిశారు. హైదరాబాద్‌లో మెగాస్టార్ ఇంటికెళ్లిన ఆమె కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు.

'రానా' ను సర్ ప్రైజ్ చేసిన 'ఖుష్బూ'
సీనియర్ నటి ఖుష్బూ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రానా కు సోషల్ మీడియా వేదికగా సర్ ప్రైజ్ ఇచ్చారు. మరి ఆ సర్ ప్రైజ్ ఏంటంటే ఖుష్బూ తన ట్విట్టర్ ద్వారా రానా చిన్నప్పటి ఫొటోను పోస్ట్ చేసింది. కలియుగ పాండవులు సినిమాతోనే వెంకటేష్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంతోనే ఖుష్బూ కూడా హీరోయిన్ గా తన కెరీర్ ప్రారంభించింది. వెంకీ, ఖుష్బూ జంటగా నటించిన ఆ మూవీ ఇద్దరికీ మొదటి చిత్రమైనా కూడా మంచి ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరూ జంటగా త్రిమూర్తులు, భారతంలో అర్జునుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఇక అప్పట్లో రానా చిన్న పిల్లాడు. అప్పుడు వెంకీ తో తీసుకున్న ఫొటోనే ఇప్పుడు ఖుష్బూ తన ట్విట్టర్…

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' లో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్
కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద చెరుకూరి సుధాకర్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ అయి సినిమాపై ఆసక్తిని పెంచాయి.