
ట్యాగ్ · 3 కథనాలు

కరోనా పై అంజలి క్లారిటీ
కరోనా ప్రభావం మళ్లీ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా..ఇప్పుడు టాలీవుడ్ లో కూడా చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత అల్లు అరవింద్, విజేయంద్రప్రసాద్, నివేదా థామస్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
మరో కన్నడ మూవీ లో అంజలి
"ఫొటో "(2006) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అంజలి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. "ఆనంద భైరవి ", "వకీల్ సాబ్ " తెలుగు మూవీస్ లో నటిస్తున్న అంజలి రెండు తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఇప్పుడు ఒక కన్నడ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

`పింక్` రీమేక్ లో అంజలి?
హిందీ బ్లాక్ బస్టర్ మూవీ `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కనున్న ఈ ఎమోషనల్ కోర్ట్ డ్రామాని `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.